Nirmal: నిర్మల్, బైంసా ఆర్టీసీ డిపోల్లో ఉత్సాహంగా గుర్తింపు యూనియన్ ఎన్నికల పోలింగ్!

Nirmal: నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా ఆర్టీసీ డిపోల్లో పదేళ్ల తర్వాత గుర్తింపు యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 9 Oct 2026 9:01 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్, బైంసా ఆర్టీసీ డిపోల్లో ఉత్సాహంగా గుర్తింపు యూనియన్ ఎన్నికల పోలింగ్!

Nirmal: రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆర్టీసీ డిపోల్లో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL