Nirmal: నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసన.. పరిష్కారం కోసం పోరాటం!
Nirmal: నిర్మల్ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. వినూత్న నిరసనలతో కార్మికులు తమ డిమాండ్లను వినిపిస్తున్నారు.
Nirmal: నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసన.. పరిష్కారం కోసం పోరాటం!
నిర్మల్ జిల్లా: కేంద్రంలోని బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా మూతికి నల్లగుడ్డాలు కట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం బస్టాండ్ నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అంతకుముందు వరంగల్ జిల్లా నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిష్కరించాలని పేర్కొన్నారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని ఐకాస నాయకులు పేర్కొన్నారు.




