Adilabad: గణేష్ ఉత్సవాలు ప్రశాంతం: ఎస్పీని అభినందించిన ఉత్సవ సమితి!

Adilabad: గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్‌కు సనాతన హిందూ ఉత్సవ సమితి ఘన సత్కారం శాంతిభద్రతల పరిరక్షణపై ప్రశంసలు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 29 Sept 2026 9:46 PM IST
Adilabad
X

Adilabad: గణేష్ ఉత్సవాలు ప్రశాంతం: ఎస్పీని అభినందించిన ఉత్సవ సమితి!

ఆదిలాబాద్: ఎస్పీకి సనాతన హిందూ ఉత్సవ సమితి సత్కారం. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పూర్తి చేసినందుకుగాను సనాతన హిందూ సమితి సభ్యులు మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ని శాలువాతో సత్కరించి గణపతి చిత్రపటాన్ని బహుకరించారు.

డీజే లను వద్దంటూ సాంప్రదాయ వాయిద్యాలను వినియోగించి వినాయక నవరాత్రి ఉత్సవాలను మరియు నిమర్జనం ఉత్సవాలను పూర్తి చేసిన కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణలో మహిళలు చిన్నారుల రక్షణలో జిల్లా పోలీసు శాఖ చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సనాతన సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి , ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్ , ఉపాధ్యక్షులు సామనపల్లి నర్సింలు, సురేష్ పాడ్వాల్ , మహిపాల్ , ఎన్నావర్ రాజు , సుభాష్ ఉరాడే , విజయ్ సభ్యులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.