Asifabad: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా.. పూర్తి జీతం ఇవ్వాలి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.
Asifabad: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా.. పూర్తి జీతం ఇవ్వాలి!
Asifabad: దసరా పండుగ వేళ వేతనాలు అందకపోవడంతో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న ఒక నెల పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిద్రిస్తూ నిరసన తెలిపారు.
పండుగ సమయంలో జీతాలు లేకుండా కుటుంబాలతో కలిసి దసరా ఎలా జరుపుకోవాలని మున్సిపల్ కమిషనర్, చైర్మన్ను కార్మికులు ప్రశ్నించారు. అడ్వాన్స్గా రూ.5 వేలు ఇస్తామని అధికారులు ప్రతిపాదించగా, తమకు అడ్వాన్స్ అవసరం లేదని, పెండింగ్లో ఉన్న ఒక నెల పూర్తి వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు.
రేపటిలోగా వేతనాలు చెల్లించకపోతే ఎల్లుండి నుంచి విధులు బహిష్కరిస్తామని కార్మికులు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజలకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించేలా నిరసన చేపడతామని తెలిపారు. పండుగకు ముందే తమ వేతన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు.




