Nirmal: దిమ్మదుర్తిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి!

Nirmal: మామడ మండలం దిమ్మదుర్తిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు. గౌడ కులస్తులకు ఎలక్ట్రికల్ స్కూటీలు, పింఛన్ కల్పించాలని నాయకుల డిమాండ్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 18 Aug 2026 1:18 PM IST
Nirmal
X

Nirmal: దిమ్మదుర్తిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి!

Nirmal: మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు సంక్షేమ పథకాలు అందజేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా ఎలక్ట్రికల్ స్కూటీలు, పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని గౌడ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story