Adilabad: శని అమావాస్య పవర్ ఇదే.. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు!
Adilabad: శని అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్‌లోని శనిశ్వరాలయం భక్తులతో పోటెత్తింది.
Adilabad: శని అమావాస్య పవర్ ఇదే.. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు!
Adilabad: శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ లోని శనిశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు శనిశ్వరుడి దర్శనభాగ్యం కోసం బారులు తీరారు. ఆలయానికి రెండు వైపులా క్యూలైన్లు కట్టి స్వామివారి దర్శనార్థం గంటల తరబడి నిరీక్షించారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజాధికాలు, తైలాభిషేకాలతో ఆలయం ప్రాంగణంలో ఆధ్మాత్మిక శోభ నెలకొంది. పట్టణం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాలు, పల్లెల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శనిశ్వరుడి సేవలో తరించిపోయారు. అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పొలిసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.
Next Story




