kagaznagar: సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద కార్మికుల దీక్షలు!
kagaznagar: కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల రిలే నిరాహార దీక్షలకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మద్దతు తెలిపారు.
kagaznagar: సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద కార్మికుల దీక్షలు!
కాగజ్‌నగర్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మిల్లు ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు కార్మికులు. ఈ రిలే నిరాహార దీక్షకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ... మిల్లు పునః ప్రారంభమయినప్పటి నుండి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం కార్మిక హక్కులను కాలరాయడమేనని అన్నారు. సంఘం లేకపోవడం వల్ల కార్మికులకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని అన్నారు.
స్థానికులకు ఉపాధి కలగాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని సదుద్దేశంతో అనేక రాయితీలు కల్పించి మిల్లు పునఃప్రారంభిస్తే యాజమాన్యం నిర్లక్ష ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన కార్మిక శాఖ అధికారులు యాజమాన్యానికి వంతపాడటం సరికాదన్నారు. పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యం గురించి కాలుష్య నియంత్రణ మండలికి ఎన్నిసార్లు పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఈరోజు జిల్లాలో పర్యటించనున్న కార్మిక శాఖ మంత్రి వివేక్ ఇక్కడి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు కార్మికులకు మద్దతుగా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే హరీశ్ బాబు వెల్లడించారు.




