Mancherial: ఆటోలో దూరిన పాము.. ప్రాణ భయంతో రన్నింగ్ ఆటో నుండి దూకేసిన కూలీలు!

Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స గ్రామంలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తున్న ఆటోలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమవడంతో భయంతో కూలీలు రన్నింగ్ ఆటో నుండి కిందకు దూకేశారు.

RAJENDER, CHENNUR
Published on: 10 Jun 2026 4:07 PM IST
Mancherial
X

Mancherial: ఆటోలో దూరిన పాము.. ప్రాణ భయంతో రన్నింగ్ ఆటో నుండి దూకేసిన కూలీలు!

మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలంలోని సిర్స గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఊహించని పెను ప్రమాదం తప్పింది. ఉపాధి హామీ కూలీలు తమ పనులను ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఊహించని షాక్ ఎదురైంది.

కూలీలు ప్రయాణిస్తున్న ఆటోలోకి పాము ప్రత్యక్షమవడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఒక్కసారిగా స్పీడ్ గా వెళ్తున్న రన్నింగ్ ఆటో నుంచి కూలీలు కిందకు దూకేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కూలీలు రన్నింగ్ ఆటో నుండి దూకేయడంతో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే 108 కి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది, వాహనంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story