Adilabad: కాప్సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మౌనిష్ రెడ్డి చేయూత
Adilabad: కాప్సీ ప్రాథమిక పాఠశాలలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
Adilabad: కాప్సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మౌనిష్ రెడ్డి చేయూత
Adilabad: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయం అని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. అదిలాబాద్ జిల్లా బేల మండలం లోని కాప్సీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చేయూత కార్యక్రమం లో భాగంగా మండల విద్యాధికారి మహాలక్ష్మి తో కలిసి విద్యార్థులకు స్కూల్ బాగ్స్, నోట్ బుక్స్ పంపిణి చేసిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లితండ్రులను సత్కరించారు.
ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా అందుతుందని, దీనికోసం ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ఇంటింటికి తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్నారని, గత సంవత్సరం కేవలం 4 విద్యార్తులు ఉన్న కాప్సీ పాఠశాలలో ఈ సంవత్సరం ఆ సంఖ్య 26 చేరెందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు మదన్ లాల్ గారిని ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ ఎం లు సుదర్శన్, కృష్ణకుమార్, సర్పంచ్ రాహుల్, ఉప సర్పంచ్ రాజేందర్ గ్రామస్తులు ఉన్నారు.




