Adilabad: ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్.. రాగి తీగ స్వాధీనం!

Adilabad: అదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర/అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 21 July 2026 7:47 PM IST
Adilabad
X

Adilabad: ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్.. రాగి తీగ స్వాధీనం!

ఆదిలాబాద్: ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముఠాకు చెందిన 8 మందిపై రూరల్, మావల పోలీస్ స్టేషన్ లలో పది కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

బృంద సభ్యులు దొంగతనాలకు పాల్పడి ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న రాగి తీగలను తీసి తక్కువ ధరకు స్క్రాప్ దుకాణ యజమానులకు అమ్ముతూ ఉండేవారని, ఈ దుకాణ యజమానులు తక్కువ ధరకు రాగి తీగలను కొనుగోలు చేసి సొమ్ము చేసుకునేవారని, కొన్ని సందర్భాలలో ఈ దుకాణ యజమానులే దొంగలతో కుమ్మక్కై దొంగతనాలు చేసేలా ప్రోత్సహించే వారిని వివరించారు.

ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగల వల్ల ప్రభుత్వానికి, విద్యుత్ శాఖ కు, మరియు రైతులకు పంట రూపంలో నష్టం జరుగుతుందని తెలిపారు. వీరి వద్ద నుండి 100 కిలోల రాగి తీగను (ఒక లక్ష 50 వేల విలువ చేసి), రెండు మొబైల్ ఫోన్స్ రెండు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కేసును చేదించడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ, రూరల్ ఎస్సై, సిబ్బంది మంగళ్ సింగ్, కరీం లను సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story