Adilabad: ఆదిలాబాద్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్పీ

Adilabad: ఆదిలాబాద్ జిల్లా లోకారి మినీ గురుకులాన్ని సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్. విద్యార్థులతో సమావేశం, భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం, సామూహిక భోజనం.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 9 July 2026 8:40 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్పీ

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఆదివాసీ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్య, ఉపాధి, భవిష్యత్ లక్ష్యాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బాల్యం నుంచే చదువుపై ఆసక్తి పెంపొందించుకొని ప్రతిరోజూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, లైబ్రరీలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో విజయాలు సాధించగలరని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ తదితర రంగాలపై ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను వెలికితీసే దిశగా కృషి చేయాలని సూచించారు. ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యార్థులతో కలిసి సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story