Nirmal: నిర్మల్ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జెండా ఆవిష్కరణ!
Nirmal: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
Nirmal: నిర్మల్ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జెండా ఆవిష్కరణ!
Nirmal: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSతో పాటు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఏఓ ఎండి యూనస్ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్ రామ్ నిరంజన్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.




