Kagaznagar: సైబర్ నేరాలపై అవగాహన సదస్సు!
Kagaznagar: కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సైబర్ నేరాలపై యువత, వృద్ధులకు అవగాహన కల్పించారు.
Kagaznagar: సైబర్ నేరాలపై అవగాహన సదస్సు!
Kagaznagar: సైబర్ నేరాలపై యువత, వృద్ధులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ నితికా పంత్.
ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కార్యక్రమం నిర్వహించారు కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ పోలీసులు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితిక పంత్ డిఎస్పీ వహీదుద్దీన్ హాజరయ్యారు.
"Cyber Crime – Together for a Safe Digital Future" కార్యక్రమంలో భాగంగా పోస్టర్ విడుదల చేసారు. పలువురు సైబర్ క్రైమ్ బాధితులు తమ అనుభవాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, సైబర్ బులీయింగ్, ఆన్లైన్ వేధింపులు, సైబర్ స్టాకింగ్ వంటి అంశాలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు పంపే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని, బ్యాంకింగ్, ఇతర యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు క్లిష్టంగా ఉండేలా రూపొందించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.




