Nirmal: దస్తురాబాద్ మండల పరిషత్ సమావేశంలో ప్రత్యేక అధికారి సమీక్ష!

Nirmal: దస్తురాబాద్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి నాగవర్ధన్ అధ్యక్షతన సమీక్ష ఉపాధి హామీ, ఆజీవిక పనులపై దిశానిర్దేశం సర్పంచులు, కార్యదర్శుల సమన్వయం తప్పనిసరి.

RAKESH N, KHANAPUR
Published on: 29 Sept 2026 6:49 PM IST
Nirmal
X

Nirmal: దస్తురాబాద్ మండల పరిషత్ సమావేశంలో ప్రత్యేక అధికారి సమీక్ష!

నిర్మల్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల పరిషత్ కార్యాలయ (MPP) సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

దీనితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకాలైన 'వికసిత్ భారత్'తో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం (Rozgar), గ్రామీణ జీవనోపాధి మిషన్ (Ajeevika Mission - Gramin) సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి నాగవర్ధన్ మాట్లాడుతూ... గ్రామాల్లో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామీణ జీవనోపాధుల మెరుగుదలకు సిబ్బంది నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR