Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి అభిషేకాలు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ చివరి మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు.

SRINIVAS, KOUTALA
Published on: 8 Sept 2026 12:30 PM IST
Asifabad
X

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి అభిషేకాలు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస ఆఖరి మంగళవారం సందర్భంగా స్వామి వారికి విషేశ ద్రవ్యముల చేత అభిషేకము విశేష అలంకరణ సహస్ర పుష్పార్చన చేది ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ మాస చివరి మంగళవారం కావడంతో తెల్లవారి జాము నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులుతీరారు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు తూమోజు తిరుమలచార్య ఆధ్వర్యంలో అభిషేకం అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఆలయాలలో భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అద్దాల మల్లయ్య కమిటీ సభ్యులు అడప వైకుంఠం జాగరి శ్రీశైలం మొండి గ్రామ పెద్దలు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story