Adilabad: ఏ ఒక్క ఓటూ కోల్పోవద్దు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్!

Adilabad: మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో ప్రత్యేక ఓటర్ సవరణ (SIR) గ్రామసభల్లో పాల్గొన్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 27 Aug 2026 3:20 PM IST
Adilabad
X

Adilabad: ఏ ఒక్క ఓటూ కోల్పోవద్దు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్!

Adilabad: అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటు కూడా కోల్పోకుండా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ప్రత్యేక ఓటర్ సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో ఆయన పర్యటించి పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు.

ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హత ఉన్న వారి పేర్లు జాబితాలో లేకపోతే వెంటనే నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు అధికారులు, బీఎల్ఓలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

“ఏ ఒక్క ఓటు కోల్పోవద్దు.. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి” అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తాంసి తహసీల్దార్ గణేష్ జాదవ్, భీంపూర్ తహసీల్దార్ రమేష్, మావల ఎంపీడీఓ ముత్యం రావు, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గోట్కూరి సర్పంచ్ మతీన్, నాయకులు ఎండి ఖమరుద్దీన్ ఖాన్, బెజ్జంకి రోహిత్, ఉప సర్పంచ్ నిమ్మల మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ తాటి అశోక్, బత్తుల కిరణ్, బీఎల్ఓలు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story