Asifabad: గోలేటి ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో గుట్కా, పొగాకు ఉత్పత్తుల కలకలం!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గోలేటి ఆశ్రమ బాలుర పాఠశాల హాస్టల్‌ను కాగజ్‌నగర్ సబ్‌ కలెక్టర్ హర్ష చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 24 Oct 2026 12:15 PM IST
Asifabad
X

Asifabad: గోలేటి ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో గుట్కా, పొగాకు ఉత్పత్తుల కలకలం!

Asifabad: ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో గుట్కా, పొగాకు ఉత్పత్తులు లభించడం కలకలం రేపింది. రెబ్బెన మండలం గోలేటిలోని ఆశ్రమ బాలుర పాఠశాల హాస్టల్‌ను కాగజ్‌నగర్ సబ్‌ కలెక్టర్ హర్ష చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ గదుల్లో గుట్కా, పొగాకు ఉత్పత్తులు కనిపించడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

హాస్టల్‌లో గుట్కా, పొగాకు ఉత్పత్తులు ఎలా వచ్చాయనే విషయంపై సబ్‌ కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులే వాటిని వినియోగిస్తున్నారని సిబ్బంది సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమైన ఇటువంటి పదార్థాలను హాస్టల్‌లోకి అనుమతించకూడదని అధికారులకు సూచించారు.

బాధ్యులపై చర్యలకు ఆదేశం

హాస్టల్ పరిసరాల్లో నిషేధిత పదార్థాలు లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థుల ప్రవర్తనతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరో గుర్తించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.