Nirmal: కడెం పాఠశాలలో ఘనంగా 'సురక్షిత్ బచ్పాన్ అభియాన్'!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో 'సురక్షిత్ బచ్పాన్ అభియాన్' నిర్వహించారు.

RAKESH N, KHANAPUR
Published on: 26 Oct 2026 12:34 PM IST
Nirmal
X

Nirmal: కడెం పాఠశాలలో ఘనంగా 'సురక్షిత్ బచ్పాన్ అభియాన్'!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేడు విద్యార్థుల చైతన్యానికి వేదికైంది. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సురక్షిత్ బచ్పాన్ అభియాన్' కార్యక్రమంలో జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ పి. రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రస్తుత సమాజంలో బాలికల భద్రత ఎంతటి ప్రాధాన్యకరమైనదో వివరించారు.

ముఖ్యంగా మైనర్లపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ఉన్న పోక్సో (POCSO) చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా, సమాజంలో నేరాలను అడ్డుకోవచ్చని తెలిపారు.

అదేవిధంగా, పెరుగుతున్న సాంకేతికతతో పాటు పొంచి ఉన్న సైబర్ నేరాల ముప్పుపై జడ్జ్ రవీందర్ విద్యార్థులను వివరించారు. సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ వేదికల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే లేదా మోసపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

బాలికలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, తమకు ఎదురయ్యే సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి లేదా చట్టపరమైన సంస్థల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR