Tanoor: పాఠశాల గదిలో విద్యార్థిని బంధం హెచ్‌ఎం సస్పెన్షన్
Tanoor: తానూర్ మండలం బెంబర్ పాఠశాలలో గదిలో విద్యార్థిని ఉండిపోగా తాళం వేసిన ఘటనపై కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హెచ్‌ఎంను సస్పెండ్ చేశారు.
Tanoor: పాఠశాల గదిలో విద్యార్థిని బంధం హెచ్‌ఎం సస్పెన్షన్
తానూర్: తానూర్ మండలంలోని ఓ గ్రామంలో పాఠశాల ముగిసినా ఓ విద్యార్థిని తరగతి గదిలోనే ఉండిపోయింది.విషయం గుర్తించకుండానే గదికి తాళం వేయడంతో తీవ్ర కలకలం రేగింది.ఈ ఘటన తానూర్ మండలం బెంబర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది.
ఇట్టి ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోవడంతో, బాధ్యతలో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయురాలు డి.స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్‌ను సైతం విధుల నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టారు.
పాఠశాల ముగిసే సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా బయటకు వెళ్లారా లేదా అనేది ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశిస్తూ...ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.




