Nirmal: దిమ్మదుర్తిలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి!

Nirmal: నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 23 Oct 2026 9:41 AM IST
Nirmal
X

Nirmal: దిమ్మదుర్తిలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి!

Nirmal: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి అన్నారు. మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

తన చిన్నతనంలో పుట్టినిల్లు తిమ్మాపూర్‌లో గ్రామస్తులందరితో కలిసి బతుకమ్మ ఆడేవారమని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మెట్టినింటి వద్ద అమ్మ, కూతుళ్లు, మనవరాళ్లతో కలిసి బతుకమ్మ ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

ప్రకృతిని పూజిస్తూ, పూలతో ఆడుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL