Adilabad: ఆదిలాబాద్‌లో ఆవిర్భావ సంబరాలు.. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం!
Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.
Adilabad: ఆదిలాబాద్‌లో ఆవిర్భావ సంబరాలు.. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం!
Adilabad: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం తోపాటు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అంతకుముందు అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. పక్క రాష్ట్రాలతోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. విద్యతో పాటు నైపుణ్య శిక్షణ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన వివరించారు.ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఆదిలాబాద్ అంటే సీఎంకు ప్రత్యేక అభిమానం, ప్రేమ ఉందన్నారు. అందుకే ఎ కార్యక్రమమైనా జిల్లా నుండి సీఎం ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ నుండి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందరినీ సమానంగా చూస్తున్నారన్నారు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఉన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా అహర్నిశలు ఉద్యమాలు చేసి... పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణా ఉద్యమకారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణా రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా సమైఖ్య ఆంద్రప్రదేశ్ లో జరిగిన అన్యాయమే జరుగుతోందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని, ఏళ్ళుగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు. తన వంతుగా ఉద్యమకారుల ఆకాంక్షలను రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళి.... వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని భరోసా కల్పించారు.




