Sirpur: చలో ఢిల్లీ.. మాలి కులస్తుల ఎస్టీ హోదా కోసం పోరాటం!

Sirpur: మాలి కులస్తులకు ఎస్టీ హోదా సాధన కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాలి సంఘం నేతలు తెలిపారు.

SRINIVAS, KOUTALA
Published on: 3 Aug 2026 11:09 AM IST
Sirpur
X

Sirpur: చలో ఢిల్లీ.. మాలి కులస్తుల ఎస్టీ హోదా కోసం పోరాటం!

Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో తెలంగాణ మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లేండుగురే శ్యాంరావు ప్రధాన కార్యదర్శి ఆదే వసంతరావు ఆధ్వర్యంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాల్లో మాలి కులస్తులకు రావలసిన ఎస్టీ హోదా సాధనకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలపై సిర్పూర్ నియోజక వర్గంలో బెజ్జూర్ చింతలమానేపల్లి కౌటాల సిర్పూర్ తదితర మండలాలలో ఉన్న మాలి సంఘం నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాలకు మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లేండుగూరె శ్యామ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంతరావు ముఖ్య అతిదులుగా ఆజారౌతు మాలి సంఘం నాయకులను మాలి సంఘం నాయకులను ఒక్కటి చేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ జిల్లాల మండలాల గ్రామాల నుంచి సంఘం నాయకులను ప్రతినిధులను కలుస్తూ

సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మాలి కులస్తులకు కావలసిన ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసన, ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తున్నారు.

ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా మాలి సంఘ సభ్యులను చైతన్యపరచడం ప్రతి జిల్లా నుంచి అధిక సంఖ్యలో సభ్యులు ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లేండుగురే శ్యాంరావు పేర్కొన్నారు.

ఈ సమావేశాలకు మాలి సంఘం రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల మండలాల గ్రామాల అధ్యక్షులు నాయకులు మాలి కులస్తులు బారి సంఖ్యలో హాజరవుతున్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story