Nirmal: నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ధర్నా పెన్షన్ విద్రోహ దినం!

Nirmal: నిర్మల్ కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ ధర్నా: సీపీఎస్ రద్దు, 2వ పీఆర్‌సీ, పెండింగ్ డీఏల విడుదలపై ఉద్యోగుల డిమాండ్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 1 Sept 2026 4:12 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ధర్నా పెన్షన్ విద్రోహ దినం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు TGEJAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పాటించి భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2వ PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలన్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన EHSను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లులను ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు హెచ్చరించారు. ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story