Adilabad: కలెక్టర్ భవేశ్ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ!
Adilabad: విద్యుత్ శాఖ (TGNPDCL) నూతన ఎస్ఈ ఎ. రమేష్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
Adilabad: కలెక్టర్ భవేశ్ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ!
ఆదిలాబాద్: జిల్లాకు బదిలీపై వచ్చిన విద్యుత్ శాఖ (టిజిఎన్ పిడిసిఎల్) నూతన ఎస్ఈ ఎ. రమేష్ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ను కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతగా పని చేసి శాఖకు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఎస్ఈ ఎ. రమేష్ కు ఈ సందర్భంగా జిల్లా అధికారులు స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఇక్కడ ఎస్ ఈ గా పనిచేసిన సుభాష్ అదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
Next Story




