Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన!

Asifabad: బెజ్జూరు మండలం తుమ్మలగూడ సర్పంచ్ కొండా రాంప్రసాద్‌ను మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

SRINIVAS, KOUTALA
Published on: 8 Sept 2026 12:08 PM IST
Asifabad
X

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన!

Asifabad: బెజ్జూరు మండలం తుమ్మలగూడ గ్రామ సర్పంచ్ కొండా రాంప్రసాద్‌పై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం రాత్రి మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తున్న సమయంలో.. సర్పంచ్ చాటు మార్గంలో సెల్‌ఫోన్‌తో వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మహిళా ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం గ్రామానికి వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం సర్పంచ్ కొండా రాంప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని, విచారించారు... ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా కానిస్టేబుల్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్య మహిళల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు అనంతరం పోలీసులు సర్పంచ్ రాంప్రసాద్ ను రిమాండ్ కు తరలించారు..

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story