Nirmal: జాతీయ రహదారిపై పెను విషాదం.. క్యాబిన్‌లోనే కాలిబూడిదైన డ్రైవర్!

Nirmal: నిర్మల్ జిల్లా మేడిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ జవారి సింగ్ సజీవ దహనం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 11 Jun 2026 11:43 AM IST
Nirmal
X

Nirmal: జాతీయ రహదారిపై పెను విషాదం.. క్యాబిన్‌లోనే కాలిబూడిదైన డ్రైవర్!

Nirmal: నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ 44 జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. గురువారం ఉదయం నాగ్ పూర్ వైపు నుండి ఆలుగడ్డల లోడుతో హైదరాబాద్ వైపు లారీ వెళ్తుంది. లారీ టైర్ పంచర్ కావడంతో మేడిపల్లి గ్రామం వద్ద హైవేపై పక్కకు నిలిపి ఉంచాడు.

అదే సమయంలో జొన్నల లోడుతో అదిలాబాదు నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారి సింగ్ లారీ క్యాబిన్ లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story