Sirikonda: వర్షాల కోసం ఆదివాసీల 'బుడు బమ్ కుకు' సంప్రదాయ వేడుక

Sirikonda: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వర్షాల కోసం గిరిజనులు వినూత్నంగా 'బుడు బమ్ కుకు' వేడుక నిర్వహించారు.

NAGULA SATISH, BOATH
Published on: 17 May 2026 11:35 AM IST
Sirikonda
X

Sirikonda: వర్షాల కోసం ఆదివాసీల 'బుడు బమ్ కుకు' సంప్రదాయ వేడుక

సిరికొండ: ఆదివాసీల సజీవ సంస్కృతికి, ప్రకృతితో వారికీ ఉన్న అవినాభావ అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గిరిజన గ్రామాల్లో వైశాఖ మాసం (బడ్‌బావై) అమావాస్య సందర్భంగా చిన్నారులు 'బుడు బమ్ కుకు' అనే సాంప్రదాయ ఆటను ఎంతో ఉత్సాహంగా ఆడారు. ​ఈ సందర్భంగా గిరిజన బాలలు కాళ్లకు గజ్జెలు కట్టుకుని, ఒక రోకలిబండకు కప్పను కట్టి భుజాలపై మోస్తూ గ్రామంలో ఊరేగించారు.

ఆ కప్పతల్లికి స్నానం చేయిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పొలిమేరల్లో పూజలు ముగించి ఆ కప్పను సురక్షితంగా వదిలిపెట్టారు. పూజల తర్వాత ఆ కప్ప ఏ దిశగా ప్రయాణిస్తే, ఆ వైపు నుండి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆదివాసీ గిరిజనులు బలంగా నమ్ముతారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సకాలంలో వానలు పడాలని వారు చేసుకునే వినూత్న ప్రార్థన ఇది.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story