Basara: బాసరలో కొత్త +2 విద్యావిధానంపై గిరిజన విద్యార్థి సంఘం ఆందోళన!

Basara: బాసరలో నూతన +2 విద్యావిధానంపై గిరిజన విద్యార్థి సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 23 Nov 2026 12:27 PM IST
Basara
X

Basara: బాసరలో కొత్త +2 విద్యావిధానంపై గిరిజన విద్యార్థి సంఘం ఆందోళన!

Basara: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న నూతన +2 విద్యావిధానంపై గిరిజన విద్యార్థి సంఘం (GVS) ఆందోళన వ్యక్తం చేసింది. బాసర లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్ మాట్లాడారు.

ముఖ్యమంత్రికి పేద విద్యార్థులపై ప్రేమ ఉంటే పెండింగ్ స్కాలర్‌షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు ఎందుకు కట్టలేదని సంఘం జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథోడ్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు సరైన భోజనం లేదని ఆరోపించారు.

ఈ విధానం వల్ల చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలకే లాభమని, చిన్న ప్రైవేట్ పాఠశాలలు మూతపడతాయని అన్నారు. పేద విద్యార్థులకు ఒరిగేదేమీ లేదని, విద్యార్థి సంఘ నాయకులతో విద్యావేత్తలతో విద్యావంతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి +2 విద్యా విధానంపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA