Nirmal: కడ్తాల్ వద్ద అంబులెన్స్‌ను లారీ ఢీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం!
Nirmal: నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ జాతీయ రహదారిపై అంబులెన్స్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
Nirmal: కడ్తాల్ వద్ద అంబులెన్స్‌ను లారీ ఢీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం!
Nirmal: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్ ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం జరి గ్రామానికి చెందిన ఓ రోగిని హైదరాబాద్కు తీసుకెళ్తున్న సమయంలో కడ్తాల్ వద్ద అంబులెన్స్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జరి గ్రామానికి చెందిన సరస్వతి, పారుబాయిలు అక్కడికక్కడే మృతి మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నారు.
అయితే ప్రమాదంలో గాయపడ్డ గీత పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.




