Boath: ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి!
Boath: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని బోథ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి పిలుపునిచ్చారు.
Boath: ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి!
Boath: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని బోథ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి పిలుపునిచ్చారు.
కుటుంబాన్ని పోషించే వ్యక్తి (18 నుండి 59 ఏళ్ల వయస్సు గలవారు) అకాల మరణం చెందితే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ లభిస్తుందని, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, నామినీ వివరాలతో గ్రామపంచాయతీ కార్యాలయం లేదా ప్రత్యేక నమోదు కేంద్రాల్లో పేరు నమోదు చేసుకొని రసీదు పొందాలని సూచించారు.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించి, అర్హులందరికీ ఈ పథకం అందేలా కృషి చేయాలని కోరారు.




