Adilabad: ఆదిలాబాద్‌ వాసవి ఆలయంలో జయంతి ఉత్సవాల సందడి

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ప్రభుత్వ అధికారికంగా ఘనంగా జరిగాయి.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 26 April 2026 3:36 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌ వాసవి ఆలయంలో జయంతి ఉత్సవాల సందడి

Adilabad: వాసవి మాత చూపిన మానవ సేవ, అహింసా మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక అశోక్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు అధికారికంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అదిలాబాద్ జిల్లాకు, ఈ పురాతన ఆలయానికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తుచేస్తూ, ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయం నుండే వైభవంగా ప్రారంభమవుతాయన్నారు. వాసవి అమ్మవారి కృపాకటాక్షాలతో జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, జిల్లాలో శాంతిభద్రతలు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

వాసవి మాత అందించిన సందేశాన్ని స్మరిస్తూ, ఆమె చూపిన మానవ సేవ, అహింసా మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు అమ్మవారు ఆనాడే పరిష్కారాన్ని చూపారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దిశలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్యవైశ్య సంఘం తన దృష్టికి తెచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ వేడుకలో డివైఎస్ఓ శ్రీనివాస్, పర్యాటక శాఖ అధికారి రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర్, భక్తులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story