Gudihathnoor: మహిళల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్!

Gudihathnoor: గుడిహత్నూర్ మండలం కొల్హారిలో రూ. 10 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.

NAGULA SATISH, BOATH
Published on: 20 Nov 2026 4:19 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: మహిళల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్!

​గుడిహత్నూర్: గ్రామాల అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా ఐక్యతతో ఉండాలని, మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తన వంతు పూర్తి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో నూతనంగా రూ. 10 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జాయింట్ కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు.

​భవన ప్రారంభోత్సవం అనంతరం ఆవరణలో మొక్కలు నాటి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ఇతర అభివృద్ధి పనుల కోసం తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏపీఓ, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH