Ichoda: ఆర్టీసీ బస్సులో నుంచి దూకి మహిళ ఆత్మహత్య!
Ichoda: నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి దూకి ఆర్తి (30) అనే మహిళ మృతి చెందింది. ఇచ్చోడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Ichoda: ఆర్టీసీ బస్సులో నుంచి దూకి మహిళ ఆత్మహత్య!
Ichoda: నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి దూకి ఓ మహిళ మృతి చెందిన విషాద సంఘటన ఇచ్చోడ సమీపంలో చోటుచేసుకుంది. ఆర్తి (30) అనే మహిళ తన తల్లితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోంది. బస్సు ఇచ్చోడ సమీపంలోని జున్ని ఎక్స్ రోడ్ వద్దకు చేరుకోగానే, ఆమె అకస్మాత్తుగా నడుస్తున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది.
దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్సగా సీపీఆర్ చేస్తూ హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో ఈసీజీ పరీక్ష నిర్వహించిన అనంతరం ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని 108 సిబ్బంది తెలిపారు తెలిపారు, కాగా ఆమె బస్సులో నుంచి దూకడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిసింది.




