Gudihatnoor: గుడిహత్నూర్ విద్యుత్ షాక్‌తో రైతు మృతి - విషాదం
Gudihatnoor: మున్నూరులో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మారుతి అనే యువకుడు మృతి. వర్షాకాలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యుత్ ఏఈ గౌతం సూచనలు.
Gudihatnoor: గుడిహత్నూర్ విద్యుత్ షాక్‌తో రైతు మృతి - విషాదం
గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం మున్నూరు గ్రామంలో విద్యుత్ షాక్‌తో షిండే మారుతి (30) అనే యువకుడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మారుతి తన వ్యవసాయ చేనులో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రైతులకు విద్యుత్ శాఖ AE సూచనలు
ఈ ఘటనపై గుడిహత్నూర్ విద్యుత్ శాఖ AE గౌతం స్పందించారు. మృతుడు మారుతి స్టార్టర్ నుండి వెళ్లే సర్వీస్ వైర్ పైన క్లాంప్ బరువు పడటంతో వైర్ కట్ అయిందని, అది క్లాంప్‌కు టచ్ అయి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మారుతి ఆ క్లాంప్‌ను తాకడంతోనే విద్యుత్ షాక్‌కు గురయ్యి ఉండవచ్చని అయిన అన్నారు, ఈ సందర్భంగా వర్షాకాలంలో రైతులకు వ్యవసాయ పనుల వద్ద ఎదురయ్యే విద్యుత్ సమస్యలు, ఇబ్బందులపై ఆయన పలు సూచనలు చేశారు. రైతులు పొలం పనుల సమయంలో చేతులకు గ్లౌజ్ లు వేసుకోవాలని, మోటార్లకు కచ్చితంగా ఎర్థింగ్ పెట్టుకోవాలని సూచించారు. అలాగే వీలైనంత వరకు ప్లాస్టిక్ స్టార్టర్ బోర్డులను మాత్రమే వాడాలని రైతులకు సూచించారు.




