Nirmal: బాసర గోదావరి వద్ద అస్వస్థతకు గురైన చిన్నారి!
Nirmal: బాసర గోదావరి నది వద్ద నిజామాబాద్‌కు చెందిన చిన్నారి అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే స్పందించిన ఆలయ ఏఈఓ జి.శ్రీనివాస్ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
Nirmal: బాసర గోదావరి వద్ద అస్వస్థతకు గురైన చిన్నారి!
Nirmal: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనార్థం నిజామాబాద్ జిల్లా నుండి వచ్చిన భక్తుల బృందంలో ఒక చిన్నారి అస్వస్థతకు గురైంది.తొలుతభక్తులంతా గోదావరి నది వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారినిదర్శించుకున్నారు.ఈ క్రమంలో గోదావరి నది వద్ద ఉన్న ఒక చిన్నారి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయికిందపడిపోయింది.
విషయాన్ని గమనించిన ఆలయ ఏఈఓ జి.శ్రీనివాస్ తక్షణమే అక్కడికిచేరుకుని స్పందించారు. చిన్నారికి అవసరమైన ప్రాథమిక సేవలు అందించి,మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికితరలించారు. ఆలయ అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.




