Adilabad: సంక్షేమంపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం: శ్రీకర్ గౌడ్!

Adilabad: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుపై బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని యువజన కాంగ్రెస్ నేత శ్రీకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.

NAGULA SATISH, BOATH
Published on: 19 Aug 2026 10:05 AM IST
Adilabad
X

Adilabad: సంక్షేమంపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం: శ్రీకర్ గౌడ్!

Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తోందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు, ధర్నాలను ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.

రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని, అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ​ఈ పథకాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 16,78,347 మంది లబ్ధిదారులకు ₹16,375.87 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

ఇందులో బీసీలకు ₹7,803.05 కోట్లు (7,79,401 మందికి), మైనారిటీలకు ₹3,204.83 కోట్లు (3,62,769 మందికి), ఎస్సీలకు ₹2,734.81 కోట్లు (2,73,164 మందికి), ఎస్టీలకు ₹1,801.48 కోట్లు (1,79,939 మందికి), ఈబీసీలకు ₹831.70 కోట్లు (83,074 మందికి) నిధులు చేకూరాయని వివరించారు.

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పాలన నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story