Nirmal: నిర్మల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో కూలర్ షాక్‌తో ఎంబాడి సతీష్ అనే యువకుడు మృతి; గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు.

RAKESH N, KHANAPUR
Published on: 30 Aug 2026 11:47 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి!

Nirmal: దస్తురాబాద్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. పెర్కపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఎంబాడి సతీష్ అనే 27 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న సతీష్, నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న ఇనుప ఎలక్ట్రిక్ కూలర్‌ను పక్కకు జరిపేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కూలర్‌కు కరెంట్ షాట్ సర్క్యూట్ కావడం వల్ల సతీష్ తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే దస్తురాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతుడి తండ్రి భీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం (PME) పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి అకాల మరణంతో పెర్కపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి."

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story