Amaravati: మన్యం వీరుడు అల్లూరికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళి!

Amaravati: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 4 July 2026 1:51 PM IST
Amaravati
X

Amaravati: మన్యం వీరుడు అల్లూరికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళి!

Amaravati: బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా అన్ని ప్రాంతాల ప్రజలు జరుపుకుంటున్నారు.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనులను ఏకం చేసి, బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన విప్లవ వీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయన త్యాగం నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అల్లూరి సీతారామరాజు స్మృతికి ఘన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ పథం వైపు నడిపించిన మహోన్నత పోరాటయోధుడు అల్లూరి అని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని పేర్కొన్నారు. తెలుగుజాతికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి స్ఫూర్తిప్రదాతగా అల్లూరి సేవలు చిరస్మరణీయమని అన్నారు.

అడవుల మధ్య నుంచి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించిన అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు ఆదర్శమని పలువురు చరిత్రకారులు పేర్కొంటున్నారనీ. స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలు, ప్రజల కోసం సాగించిన పోరాటం భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డాయన్నారు. జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.


Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story