Amaravati: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం కీలక నిర్ణయాలు!
Amaravati: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధ్యక్షతన జరిగిన డైరెక్టర్ల సమావేశంలో రాష్ట్రంను డంప్ యార్డ్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించారు.
Amaravati: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం కీలక నిర్ణయాలు!
Amaravati: రాష్ట్ర వ్యాప్తంగా 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల సమర్థ నిర్వహణపై ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాయపూడిలోని 3వ బ్లాక్‌లో కార్పోరేషన్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధ్యక్షతన డైరెక్టర్ల సమావేశం జరిగింది.
సమర్థవంతమైన నిర్వహణతో డంప్ యార్డ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాన్పూరు ఐఐటీ, ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీ ఇన్ ఇండియా వారి సహకారంతో స్పెషల్ ఆపరేటింగ్ ప్రాసెసింగ్(ఎస్ఓపీ) విధానంలో రాష్ట్రంలో నెట్ జీరో అమలు చేయాలని, మార్కెట్లు, దేవాలయాలు... వంటి పబ్లిక్ ప్రదేశాల్లో టాయిలెట్స్ నిర్మించాలని, రోడ్డు పక్కన వేస్ట్ క్లీనింగ్‌కు యంత్రాలను వినియోగించాలని, గ్రామాలలో చెరువుల శుభ్రతపై దృష్టి పెట్టాలని సమావేశం నిర్ణయించింది.
కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన లెగసీ వేస్ట్‌ని త్వరగా తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లెగసీ వేస్ట్ త్వరితగతిన క్లియర్ చేయడానికి అవసరమైనచోట్ల జేసీబీలను వినియోగించాలన్నారు.
నగరాలు, పట్టణాలలో ఫ్రెష్ గా వచ్చే వేస్ట్ ని లెగసీ వేస్ట్ లో కలపకుండా చూడాలని, కమిషనర్లకు అందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. లెగసీ వేస్ట్ తొలగించే క్రమంలో లోడింగ్ సమయంలో వేస్ట్ కింద పడకుండా చూడాలన్నారు. కార్పోరేషన్ కార్యక్రమాలన్నీ ఎటువంటి లోపాలు లేకుండా పక్కాగా ఉంచాలని చెప్పారు. ఇన్సూరెన్స్ లేని ఈ-ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పారు. రోడ్డు పక్కన వేస్ట్ క్లీన్ చేయడానికి కొత్తగా ‘స్వచ్ఛపథం’పేరుతో యంత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు.
మొదట ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక యంత్రం ఇచ్చే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ఈ యంత్రాలు రోడ్ల పక్కన కొబ్బరిబోండాలను కూడా క్లీన్ చేస్తాయన్నారు. కార్పోరేషన్ తరఫున చేపట్టే ప్రతి కార్యక్రమం బయోమైనింగ్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, ఈ-ఆటోలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగు దొడ్లు, జరుగుతున్న పనులు, ఇతర మిషనరీకి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లాల వారీగా, మున్సిపాల్టీల వారీగా తయారు చేసి డైరెక్టర్లకు అందజేయాలని అర్భన్, గ్రామీణ విభాగాలకు చెందిన అధికారులకు ఆయన చెప్పారు.
కార్పోరేషన్ తరఫున కొనుగోలు చేసే యంత్రాల నాణ్యత విషయంలో, నాణ్యత చెక్ చేయడంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అలాగే, గ్రామాలలో చెరువుల శుభ్రతపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. ఇంటింటికి తిరిగి చెత్తసేకరించే ఎలక్ట్రిక్ వాహనాలు, ఏజన్సీల నిర్వహణ, వెట్ వేస్ట్, బయోమైనింగ్, డ్రైవేస్ట్, లిక్విడ్ వేస్ట్, రీసైక్లింగ్, బయోఫర్టిలైజర్స్, సోలార్ విద్యుత్, 15వ ఫైనాన్స్ నిధుల వినియోగం... తదితర విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో మున్సిపాల్టీలకు, పంచాయతీలకు ఇవ్వడానికి 267 ఈ-ఆటోలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ పి.సంపత్ కుమార్ ఆన్ లైన్ లో పాల్గొనగా, కార్పోరేషన్ ఎండీ బండా సునీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్లు చిన్ని శ్రీనివాసరావు, రవి కుమార్, ఆరుద్ర భూలక్ష్మి, లక్ష్మణరావు బొమ్మినేని, ఎం.నాగలక్ష్మి, ఎన్.పర్వీన్ భాను, నాగమణి బోలెం, పరుచూరి భవానీ రవికుమార్, రాము బుచ్చా, రెడ్డివారి మంజునాథ్, సానారెడ్డి కల్పనారెడ్డి, ఉదయ భాస్కర్ కూచిపూడి, పట్టాభిరామయ్య సాలాది, మువ్వల వెంకట రమణ, కార్పోరేషన్ సీఈ వేణుగోపాల్, , సీఓఓ దశరథ రామిరెడ్డి, ఈడీ ఊర్మిళాదేవి, అర్జునరావు, ఎఫ్ఎం విజయశేఖర్, ఈఈ సుహాసిని, డీఈలు వరప్రసాద్, జయదేవ్, సతీష్, లక్ష్మి, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.




