Amaravati: ఏపీ శాసనసభలో దివంగత నేతలకు ప్రగాఢ సంతాపం!

Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సంతాప తీర్మానాలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 20 Aug 2026 10:18 AM IST
Amaravati
X

Amaravati: ఏపీ శాసనసభలో దివంగత నేతలకు ప్రగాఢ సంతాపం!

Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ కొలువుదీరిన వెంటనే ఇటీవల కన్నుమూసిన పలువురు మాజీ శాసనసభ్యులు, ప్రముఖ నాయకుల మృతికి సంతాపం తెలియజేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు.

చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు పి. చిన్నరాజన్, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, న్యాయవాది నాదెండ్ల భాస్కరరావు, భీమిలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజా సాగి దేవీ ప్రసన్న అప్పలనరసింహరాజు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే తుక్కా పగడాలమ్మ, ప్రకాశం, బాపట్ల జిల్లాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నాయకుడు జి.ఎస్. రావు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి శాసనసభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. దివంగత నేతలంతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, వివిధ ప్రజాప్రతినిధుల హోదాల్లో రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. ప్రజా సేవలో వారు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సభ తరఫున, తన వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story