Amaravati: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. నాలుగు సమావేశాల తర్వాత హాజరైన పవన్!

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం. చాలా కాలం తర్వాత హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 Sept 2026 3:04 PM IST
Amaravati
X

Amaravati: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. నాలుగు సమావేశాల తర్వాత హాజరైన పవన్!

Amaravati: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. గత నాలుగు కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరుకాకపోగా.. తాజా సమావేశానికి ఆయన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలతో కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆరోగ్యం కుదుటపడటంతో మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు సమావేశంలో పాల్గొంటున్నారు.

ఇక ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులు, సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా, రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అదే సమయంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, రిజర్వేషన్లు, పరిపాలనా ఏర్పాట్లపై మంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు కొత్త అసెంబ్లీ భవన నిర్మాణ ప్రతిపాదనలు, వివిధ శాఖలకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగు కేబినెట్ సమావేశాల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి మండలి సమావేశానికి హాజరుకావడంతో.. సమావేశంలో ఆయన పాల్గొనడం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి నెలకొంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.