Pawan Kalyan: మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: రక్షాబంధన్ సందర్భంగా మహిళలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళా భద్రత, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Pawan Kalyan: మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములకున్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సోదరీమణులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి భారతీయ కుటుంబ వ్యవస్థలోని బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు భావోద్వేగ సంకేతమని, సోదర భావాన్ని చాటడంతో పాటు మహిళలకు గౌరవం, భద్రత, భరోసాను అందించే పండుగ అని అన్నారు.
రాష్ట్రంలో మహిళల భద్రత, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దీపం-2 ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
డోలీ రహిత గిరిజన గ్రామాల కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే 426 గిరిజన ఆవాసాలను రహదారులతో అనుసంధానించామని, అడవితల్లి బాట ఫేజ్-2 ద్వారా ఈ రహదారులను మరింత విస్తరించే చర్యలు చేపట్టామని చెప్పారు.
గిరిజన మహిళల్లో కనిపించే సికిల్ సెల్ అనీమియా వంటి జన్యుపరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు అరకులో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఆడపడుచుల భద్రత, అభ్యున్నతి, సాధికారత కోసం కూటమి ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.




