AP: సంక్షేమ పథకాల ప్రచారానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు!

AP: ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు గుడ్ న్యూస్ సంక్షేమ పథకాల ప్రచారానికి ఎన్‌ప్యానల్‌మెంట్ విధానం.. ఫాలోవర్ల ఆధారంగా గరిష్టంగా నెలకు పారితోషికం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 28 Sept 2026 11:07 PM IST
AP
X

AP: సంక్షేమ పథకాల ప్రచారానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు!

AP: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎన్‌ప్యానల్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలను చేరుకోగలిగే ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించనున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్‌ప్యానల్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకోనున్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు, అర్హులైన లబ్ధిదారులు పథకాల ప్రయోజనాలను పొందేలా అవగాహన కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎన్‌ప్యానల్‌మెంట్ కోసం కొన్ని అర్హతలు, ప్రమాణాలను ప్రభుత్వం నిర్దేశించనుంది. సోషల్ మీడియా వేదికల్లో వారి ఫాలోయింగ్, కంటెంట్ నాణ్యత, ప్రజల్లో ఉన్న చేరువ, గతంలో చేసిన ప్రచార కార్యక్రమాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంపిక చేసిన అనంతరం వారికి ప్రభుత్వం చేపట్టే ప్రచార కార్యక్రమాలపై అవసరమైన సమాచారం అందించనున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.