Amaravati: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం!
Amaravati: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Amaravati: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం!
Amaravati: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భగవద్గీత ద్వారా మానవాళికి ధర్మం, కర్తవ్యనిష్ఠ, సత్యం, న్యాయం, నిస్వార్థ సేవ వంటి గొప్ప విలువలను శ్రీకృష్ణ పరమాత్మ బోధించారని మంత్రి పేర్కొన్నారు.
కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా, ధర్మం వైపు నిలిచి ముందుకు సాగాలనే సందేశాన్ని శ్రీకృష్ణుడి జీవితం మనకు అందిస్తుందని తెలిపారు.“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అనే గీతా వాక్యం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలనే స్ఫూర్తిని అందిస్తుందని మంత్రి అన్నారు.
శ్రీకృష్ణుడి బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రాసంగికమని, ప్రేమ, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించుకుంటూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు




