AP Ministers Singapore Tour Day 2: సింగపూర్‌ లో ముగిసిన ఏపీ మంత్రుల రెండో రోజు పర్యటన

AP Ministers Singapore Tour Day 2: ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో రెండో రోజు కీలక భేటీలు. హోం మంత్రి షణ్ముగంతో సమావేశం, సింగపూర్ సిటీ గ్యాలరీ సందర్శన. సుపరిపాలన, అత్యాధునిక నగరాల నిర్మాణంపై లోతైన అధ్యయనం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 April 2026 8:02 AM IST
AP Ministers Singapore Tour Day 2: సింగపూర్‌ లో ముగిసిన ఏపీ మంత్రుల రెండో రోజు పర్యటన
X

సింగపూర్/అమరావతి: సుపరిపాలన మరియు భవిష్యత్తు నగరాల నిర్మాణంపై క్షేత్రస్థాయి పరిశీలన నేపథ్యంలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం రెండో రోజు పర్యటన అత్యంత కీలకమైన అంశాల చుట్టూ సాగింది. పాలనలో జవాబుదారీతనం, అత్యాధునిక నగరాల నిర్మాణం మరియు శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై మంత్రులు లోతైన అధ్యయనం చేశారు.

ముందుగా మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, మరియు సత్యకుమార్ యాదవ్ ల బృందం ఇవాళ ఉదయం సింగపూర్ హోం మంత్రి షణ్ముగం గారితో భేటీ అయ్యారు.దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగే పాలన (Nation First Governance) మరియు రాజకీయ జవాబుదారీతనంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే తాటిపైకి వచ్చి, సమన్వయంతో ప్రజలకు సేవలను ఎలా అందించాలనే అంశంపై చర్చించారు.

మధ్యాహ్నం మంత్రుల బృందం 'సింగపూర్ సిటీ గ్యాలరీ'ని సందర్శించింది. కేవలం 50 ఏళ్ల కాలంలో సింగపూర్ ఒక చిన్న ద్వీపం నుండి గ్లోబల్ సిటీగా ఎలా రూపాంతరం చెందిందో తెలియజేసే మోడల్స్ మరియు భవిష్యత్తు ప్రణాళికలను వారు ఆసక్తిగా గమనించారు.అనంతరం

'సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్' ఆధ్వర్యంలో గవర్నెన్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రాంపై మంత్రులకు ప్రత్యేక శిక్షణ లభించింది. అలాగే సింగపూర్ ప్రధాని స్ట్రాటజీ గ్రూపులో భాగమైన 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఫ్యూచర్స్' సంస్థను సందర్శించి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ముందే అంచనా వేసి విధానాలను ఎలా రూపొందించాలో తెలుసుకున్నారు.ఇంకా రెండు రోజు చివరగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS Cities) విభాగంలో మంత్రులు పర్యటించారు. ఆధునిక నగరాల అభివృద్ధి, భూ వినియోగం (Land Use Governance) మరియు పట్టణ ప్రణాళికలో పాటించాల్సిన దీర్ఘకాలిక వ్యూహాలపై అక్కడి ప్రతినిధులు మంత్రులకు వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story