AP: ఏపీలో అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ!
AP: ఏపీలో అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బ్యాంకుల సెలవులు, సమ్మె నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.
AP: ఏపీలో అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ!
AP: రాష్ట్రంలోని పింఛనుదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అయితే బ్యాంకుల సెలవులు, ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో నగదు విత్‌డ్రా ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచే పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబర్ నెల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.2,692.34 కోట్లను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మరో రూ.16.65 కోట్లను పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు SNA SPARSH విధానం ద్వారా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛను జమ చేసే ప్రక్రియను విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆ మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాల్లో రూ.6 లక్షలు నేరుగా జమ కానున్నాయి....
మరోవైపు పింఛన్ల పంపిణీ సమయంలో బ్యాంకుల సెలవులు, సమ్మె ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 26న బ్యాంకు సెలవు ఉండగా.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. దీంతో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును ఉదయమే విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి SLBCకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు...
అక్టోబర్ 1వ తేదీ ఉదయం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకుంటారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం నుంచి పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారు. దీంతో బ్యాంకు సెలవులు, సమ్మె కారణంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పింఛనుదారులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది...
పింఛన్ల పంపిణీ తేదీ, విధానంలో చేసిన ఈ మార్పులను పింఛనుదారులు గమనించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. పంపిణీ సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అక్టోబర్ 1న నిర్ణీత సమయంలో పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు....




