Amaravati: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
Amaravati: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నిర్వహించిన రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మొదట అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ నవంబర్ 1న పోలింగ్, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించేలా సవరించింది.
మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, చైర్‌పర్సన్, వార్డు సభ్యుల ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ నవంబర్ 3న పూర్తయింది. తుఫాను ప్రభావంతో వాయిదా పడిన చీరాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు నవంబర్ 6న పూర్తయింది.




