Vijayawada: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్‌వాడీ ఉత్సవ్’!

Vijayawada: విజయవాడలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్‌‌వాడీ ఉత్సవ్’ హాజరైన వనతి శ్రీనివాసన్ చిన్నారులు, గర్భిణుల సంరక్షణలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని ప్రశంస.

Hari Kishan  AP Bureau Chief
Published on: 2 Oct 2026 9:44 PM IST
Vijayawada
X

Vijayawada: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్‌వాడీ ఉత్సవ్’!

విజయవాడ: అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్‌వాడీ ఉత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలోని వి. కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఇంఛార్జి వనతి శ్రీనివాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ ఏపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎం. నిషిధ రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. చిన్నారుల సంరక్షణ, పోషణతో పాటు గర్భిణులు, బాలింతలు, తల్లులు, శిశువుల సంక్షేమంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేరేలా అంగన్‌వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను అభినందించారు.

కార్యక్రమంలో భాగంగా తల్లులకు చీరలు, తాంబూలాలను అందజేశారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం సమాజంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు.

‘సేవా సంకల్ప్ అభియాన్’ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా నాయకులు చెప్పారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు సేవలందిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.