Amaravati: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఏపీకి ప్రాధాన్యం.. మంత్రి హర్షం!

Amaravati: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రకటించిన కార్యవర్గంలో ఏపీ నేతలకు కీలక పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్.

Hari Kishan  AP Bureau Chief
Published on: 18 Aug 2026 12:26 PM IST
Amaravati
X

Amaravati: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఏపీకి ప్రాధాన్యం.. మంత్రి హర్షం!

Amaravati: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన 65 మందితో కూడిన నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ, రామ్ మాధవ్‌లను జాతీయ ఉపాధ్యక్షులుగా, విష్ణువర్ధన్ రెడ్డిని సంయుక్త సమన్వయకర్తగా నియమించడం అభినందనీయమన్నారు.

రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు అధిరోహిస్తూ, క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి పార్టీ అత్యున్నత స్థాయికి ఎదగడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరీ, రామ్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. దేశాన్ని వికసిత్ భారత్‌గా, ఆంధ్రప్రదేశ్‌ను వికసిత్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో నూతన జాతీయ కార్యవర్గ సభ్యులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఏపీకి చెందిన నాయకులకు బీజేపీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story