Vizag: ఏపీలో నెల రోజుల పాటు మెగా స్పోర్ట్స్ ఈవెంట్ షెడ్యూల్ విడుదల!
Vizag: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి ఛాంపియన్‌షిప్-2026 అధికారిక పోస్టర్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో ఆవిష్కరించారు
Vizag: ఏపీలో నెల రోజుల పాటు మెగా స్పోర్ట్స్ ఈవెంట్ షెడ్యూల్ విడుదల!
విశాఖ: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్-2026 అధికారిక పోస్టర్‌ను భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు,రాష్ట్ర గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం విశాఖలో సంయుక్తంగా ఆవిష్కరించారు.
రాబోయే జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఈక్రీడా సంబరాలు జరగనున్నాయి. 12 క్రీడాంశాలలో మూడు విభాగాలుగా పోటీలను నిర్వహించనున్నారు.
నియోజకవర్గ స్థాయి ఎంపికలు..జూలై15 నుండి జూలై 25వరకునియోజకవర్గాల మధ్య, పోటీలు & ఎంపికలు..జూలై 26నుండి ఆగస్టు10వరకు.రాష్ట్ర స్థాయి పోటీలు..ఆగస్టు 20నుండి,ఈ పోటీలను అండర్-17, అండర్-23 విభాగాల్లో అబ్బాయిలకు,అమ్మాయిలకు విడివిడిగా నిర్వహిస్తారు.వివిధ క్రీడా సంఘాలు,ఇంటర్మీడియట్ బోర్డు,ఉన్నత విద్యా శాఖ, పాలిటెక్నిక్,ఐటీఐ,పాఠశాల విద్యాశాఖల సమన్వయంతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఈపోటీలను ఏర్పాటు చేస్తోంది.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విశాఖ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాల్యాట్,విశాఖ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. నారాయణరావు,డీఎస్ఏ కోచ్‌లు పాల్గొన్నారు.




